కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటువేయాలని విప్ జారీ చేసిన మాయవతి

రాజస్థాన్ రాజకీయాలు యావత్ దేశాన్ని తొంగి చూసేలా చేస్తున్నాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి తీసుకున్న కీలక నిర్ణయం.. ప్లోర్ టెస్టుకు సిద్ధమవున్న అశోక్ గెహ్లాట్‌కు షాక్ ఇచ్చింది. ప్లోర్ టెస్టు సమయంలో అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను విప్ జారీ చేశారు. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర కూడా వేశారు. విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేస్తే.. అనర్హత వేటుకు గురవుతారని బీఎస్పీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. అయితే, పార్టీ విలీనం అయిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ.. బీఎస్పీ జాతీయ పార్టీ అని, జాతీయస్ధాయిలో బీఎస్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే తప్ప రాష్ట్రస్ధాయిలో ఆరుగురు ఎమ్మెల్యేల విలీనం కుదరదని పార్టీ హైమాండ్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com