మరోసారి మార్కెట్లోకి గోల్డ్ బాండ్స్

సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్స్ - SGBమళ్లీ వస్తోంది. ఇప్పటివరకూ నాలుగుసార్లు సావరీన్ బాండ్లు విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 3 నుంచి 7 వరకూ మళ్లీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరంలో నాలుగు సార్లు బాండ్లు రిలీజ్ చేసింది. చివరగా జులై6 -10 మధ్య అందుబాటులో ఉంచింది. అప్పుడు మార్కెట్ ధర ఆధారంగా గ్రాముకు రూ.4852గా నిర్ణయించింది. ముంబై బేస్ డ్ ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ నిర్ణయించే ధరను బేస్ గా తీసుకుని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఆన్ లైన్ ద్వారా పర్చేజ్ చేసేవారికి గ్రాముకు 50రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. గోల్డ్ బాండ్స్ పై వడ్డీరేటు 2.50శాతం గా ఉంటుంది. సెమీ యాన్చువల్ గా చెల్లిస్తారు. గోల్డ్ బాండ్స్ ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. గోల్డ్ బాండ్ లాక్ పిరియడ్ 8ఏళ్లుగా ఉంది. అయితే సబ్ స్ర్ర్కిప్షన్ తీసుకున్న 5 ఏళ్ల తర్వాత ఎగ్జిట్ అయ్యే ఛాన్సుంది. ఇందులో వ్యక్తులు, సంస్థలు, HUFలు, యూనిర్శిటీలు, చారిటిబుల్ ట్రస్టులు ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్చేంజెస్ BSE, NSE, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా కొనవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com