కరోనా నుంచి కోలుకున్న బుల్లితెర నటి

కరోనా నుంచి కోలుకున్న బుల్లితెర నటి

బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. తన క్వారంటైన్ గడువు ముగిసిందని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నా క్వారంటైన్ ముగిసింది. ముందుకన్నా ఇప్పుడు బాగానే ఉన్నాను. మా తల్లిదండ్రుల ప్రార్థనలు, మీ ప్రేమాభిమానాల వల్ల కరోనాను జయించాను. మీ మద్దతు లేకపోయుంటే ఈ ప్రయాణం పూర్తయ్యేది కాదు. నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు. ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాలేవు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. కరోనాను నయం చేయవచ్చు. కానీ చికిత్స కన్నా నివారణ మేలు అన్న విషయం గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శారీరకపోరాటం కన్నా మానసిక పోరాటం ఎక్కువగా చేశానని చెప్పారు. సహనటుడు రవికృష్ణ కూడా కరోనా నుంచి బయటపడ్డారు. వారం క్రితమే ఆయన కోలుకున్నారు.

Read MoreRead Less
Next Story