రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 60 మంది మృతి!

సూడాన్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్లో 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. పశ్చిమ డార్ఫర్ ప్రావిన్సు రాజధాని జెనేనాకు దక్షిణాన 48 కి.మీ. దూరంలో ఉన్న మస్తేరీలో ఈ ఘటన జరిగింది.
ముసలిట్, ఇతర అరబ్ తెగల మధ్య ఈ ఘర్షణలు జరిగాయని సుడాన్‌లోని యూఎన్ ఆఫీస్ ఫర్ ద కో ఆర్డినేషన్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ పేర్కొంది. శనివారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 500 మంది సాయుధులు మస్తేరి గ్రామంపై దాడిచేశారు.
ఈ దాడి ఆదివారం ఉదయం వరకు కొనసాగినట్లు తెలిపింది. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో జెనేనా పట్టణంలోని హాస్పిటల్‌కి తరలించినట్లు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com