పిడుగుపడి 11మంది మృతి

పిడుగుపడి 11మంది మృతి
X

పశ్చిమబెంగాల్‌లో పిడుగుపాటుకి గురై 11 మంది మృతిచెందారు. మొత్తం మూడు జిల్లాలో 11మంది మరణించడంతో.. ఈ ఘటణలు చోటుచేసుకున్న గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో మరో ఐదుగురు, హౌరాలో ఒకరు.. మొత్తం 11మంది మరణించారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగులు పడి మరణించారని అన్నారు. వర్షం పడుతుందని ఓ రైతు చెట్టు కిందకు తల దాచుకునేందుకు రాగా పిడుగుపడి మరణించారు. దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం అధికారులు చెప్పారు.

Tags

Next Story