అయోధ్య ఆలయ నిర్మాణానికి కౌసల్య ఊరి నుంచి మట్టి: ముస్లిం సోదరుడి భక్తి

అయోధ్య ఆలయ నిర్మాణానికి కౌసల్య ఊరి నుంచి మట్టి: ముస్లిం సోదరుడి భక్తి
X

మత మౌఢ్యం మాకేమీ లేదు.. మనమంతా ఒక్కటే.. ముందు మనమంతా భారతీయులం.. రామునికి ఆలయం అయోధ్యలో కడుతున్నారంటే మాకు మాత్రం సంతోషం కాదా అని ముస్లిం సోదరులూ తలో చెయ్యి వేస్తున్నారు.. ఆలయ నిర్మాణంలో తామూ పాలు పంచుకుంటామని రాముని పట్ల అపారమైన భక్తితో చెబుతున్నారు. ఆగస్ట్ 5 అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్ ఘడ్ లోని చంద్ఖురి గ్రామానికి చెందిన ముస్లిం సోదరుడు మొహమ్మద్ ఫైజ్ ఖాన్.. గ్రామం నుంచి మట్టిని తీసుకుని 800 కిలో మీటర్లు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్ లోని అన్పూర్ కు చేరుకున్నాడు.

తమ గ్రామంలోనే రాముని తల్లి కౌసల్య జన్మించిందని, అందుకే అక్కడి నుంచి మట్టిని తీసుకు వచ్చానని చెప్పాడు. తాను ముస్లిం అయినా తన పూర్వీకులు హిందువులు అని తెలిపారు. నేను దేవాలయాలు సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు.. ఇంతకు ముందు అనేక దేవాలయాలు సందర్శించానని ఇప్పటి వరకు 15 వేల కిలో మీటర్లు వివిధ దేవాలయాల సందర్శన నిమిత్తం వెళ్లానని అన్నారు. ప్రయాణంలో వివిధ మఠాలలో బస చేసినట్లు తెలిపారు. నేను చేస్తున్న పనిని ఎవరూ వ్యతిరేకించలేదు అని ఖాన్ పేర్కొన్నారు.

నేను రాముడి భక్తుడిని. మన పూర్వీకుల గురించి తెలుసుకుంటే, వారు హిందువులు. వారి పేర్లు రామ్‌లాల్ లేదా శ్యామ్‌లాల్ కావచ్చు. చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్లినా మనందరికీ హిందూ మూలం ఉంది "అని ఆయన అన్నారు. రామాలయ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని గత వారం పూణేలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి 200 మంది మాత్రమే హాజరవుతారని, ఈ కార్యక్రమంలో అన్ని సామాజిక దూర నిబంధనలను పాటిస్తామని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి మహారాజ్ చెప్పారు. రామాలయం నిర్మాణం కోసం అయోధ్య వద్ద ఉన్న స్థలాన్ని అప్పగించాలని, మసీదు నిర్మించడానికి ముస్లింలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 9 న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags

Next Story