భారత్ లో కరోనా రికవరీ రేటు 63.92 శాతం..

భారత్ లో కరోనా రికవరీ రేటు 63.92 శాతం..
X

ఐసిఎంఆర్ ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5.15 లక్షల కరోనా పరీక్షలు చేసింది. మొత్తం 5 లక్షల 15 వేల 472 మందిని ఆదివారం పరీక్షించారు. దేంతో దేశంలో ఇప్పటివరకు 1.68 కోట్ల మందికి కరోనా పరీక్షలు జరిపినట్టయింది. అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు పరీక్షపై దృష్టి పెట్టాలని ఈ సందర్బంగా ఐసిఎంఆర్ తెలిపింది. పరీక్ష మరియు ట్రాకింగ్ తర్వాత కరోనా సోకినవారికి చికిత్స చేయడం ద్వారా మాత్రమే సంక్రమణను నివారించవచ్చని చెప్పింది.

కాగా భారత్ లో సోమవారం 49,931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే 708 మంది కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453కు, మరణాలు 32,771కు చేరాయని కేంద్రం సోమవారం ప్రకటించింది. 9,17,567 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 4,85,114. రికవరీ రేటు 63.92 శాతానికి చేరింది.

Tags

Next Story