తమిళనాడులో కరోనాతో ఒక్కరోజే 77 మంది మృతి

తమిళనాడులో కరోనాతో ఒక్కరోజే 77 మంది మృతి
X

తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,993 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 77 మంది మృత్యువాత పడినట్లు సోమవారం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,20,716కు చేరింది. సోమవారం ఒక్కరోజే 5,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 54,896 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story