ఆర్టీసీ సిబ్బందికి కొవిడ్.. 670 మందికి పాజిటివ్

ఆర్టీసీ సిబ్బందికి కొవిడ్.. 670 మందికి పాజిటివ్
X

ఏపిఎస్ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో కొవిడ్ బారిన పడుతున్నారు. మొదట్లో రోజుకి 5-10 పాజిటివ్ కేసులు వస్తే.. ఇప్పుడు ఆసంఖ్య 60-70కి చేరింది. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 670 మందికి వైరస్ సోకింది. అత్యధికంగా కడప జోన్ లో 260 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 71 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 10 మంది సిబ్బంది మహమ్మారి సోకి మరణించారు. కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆర్టీసీ అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోజుకు 12 వేల బస్సులు నడపాల్సింది 3 వేల బస్సులను మాత్రమే నడుపుతున్నారు. రాబడి కూడా రోజువారి రాబడి రూ.13 కోట్లు వచ్చేది ఇప్పుడు రూ. 2 కోట్లు కూడా రావడం లేదు.

Tags

Next Story