బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్‌పై రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్‌పై రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్​ క్వాజీ ఒనిక్​‌పై వేటు పడింది. డోపింగ్ టెస్టులో విఫలమవడంతో ఒనిక్ రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. నవంబర్​ 2018లో నేషనల్ క్రికెట్ లీగ్ సందర్భంగా ఒనిక్ నుంచి డోప్ టెస్టుల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు( బీసీబీ) నమూనాలను సేకరించింది. అయితే పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలడంతో బీసీబీ.. ఒనిక్​పై రెండేళ్ల నిషేధం విధించింది. ఒనిక్ తన తప్పును అంగీకరించాడు. గతేడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఒనిక్​పై ప్రాథమిక సస్పెన్షన్ ఉంది. దీంతో అప్పటి నుంచే నిషేధం లెక్కలోకి రానుంది. దీంతో 2021 ఫిబ్రవరి 7న మళ్లీ క్రికెట్ ప్రారంభించేందుకు క్వాజీ ఒనిక్​ అర్హుడవుతాడు.

Tags

Read MoreRead Less
Next Story