మొద్దుశీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాష్ మృతి

మొద్దుశీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాష్ మృతి
X

మొద్దుశీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాష్ జైల్లో మృతిచెందాడు. కొద్దిరోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓం ప్రకాష్ సోమవారం మరణించాడు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రను హత్యచేసిన నిందితుడు మొద్దుశీను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే 2008 లో రాత్రి సమయంలో ఓం ప్రకాష్ మొద్దుశీనును డంబెల్ తో మోదీ హతమార్చాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అతను మృతిచెందాడు.

Tags

Next Story