బీజేపీ పటిష్టతకు కృషి చేస్తా: సోము వీర్రాజు

బీజేపీ పటిష్టతకు కృషి చేస్తా: సోము వీర్రాజు
X

ఏపీలో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా మాట్లాడిన సోము.. బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, పార్టీలోని ప్రతిఒక్కరిని సమన్వయం చేసుకొని ఏపీలో పార్టీని ముందుకు నడిపిస్తానని అన్నారు.

ఈ సందర్బంగా తనను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ ప్రధాన-కార్యదర్శి బిఎల్ సంతోష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా నిన్నటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజును నియమించింది బీజేపీ అధిష్టానం.

Tags

Next Story