'పాజిటివ్' వ్యక్తులకు అందించాల్సిన ఆహారం, ఔషధం

కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత అత్యవసరమైతేనే ఆస్పత్రుల్లో ఉంచుతున్నారు. లేదంటే హోం క్వారంటైన్ లో ఉండమని పంపించేస్తున్నారు. ఇంట్లో ఉన్నా టైమ్ ప్రకారం తీసుకునే ఆహారం విషయంలో కానీ, వేసుకునే మందుల విషయంలో కానీ జాగ్రత్త వహించమంటున్నారు వైద్యులు. అప్పుడే కోవిడ్ బారినుంచి విముక్తులవుతారని చెబుతున్నారు. షెడ్యూల్ చార్ట్ ఇంట్లో పెట్టుకుని ఆ విధంగానే వారు పాటిస్తూ ఇంట్లోని వారు కూడా అవే జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. దగ్గరగా ఉంటారు కాబట్టి ఇంట్లో వారికి కూడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఏ సమయానికి ఏం తీసుకోవాలి అనేది వైద్యులు సూచించిన ప్రకారం ఈ విధంగా..
ఉదయం 6.30 గంటలకు పొంగల్, ఇడ్లీ, వడ, కిచిడీ, ఉప్మా అల్పాహారంగా తీసుకుని ఓ అరగంట తరువాత కషాయం తాగాలి.
మధ్యాహ్నం ఒంటిగంటకు పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండుతో భోజనం
సాయింత్రం 4 గంటలకు రాగిజావ, ఖర్జూరం, బాదం పప్పు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య పప్పు, సాంబారు, చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, పెరుగు, అన్నం, కోడిగుడ్డు అంజేస్తారు.
నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు
జ్వరం : థర్మామీటర్ తో రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
ఆక్సిజన్/పల్స్ రేట్: పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
ఆహారం: వైద్యులు సూచించిన పౌషికాహారంతో పాటు పండ్లు
2 వారాలపాటు వాడాల్సిన మందులు
విటమిన్ సి 500 ఎంజి.. రోజూ ఉదయం, సాయింత్రం తిన్నతర్వాత వేసుకోవాలి.
విటమిన్ డి .. రోజుకు ఒకటి తిన్న తరువాత
మల్టీవిటమిన్-జింక్.. రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయింత్రం భోజనం చేసిన తరువాత
పారాసిటమల్ 500 ఎంజీ లేదా 650 ఎంజీ.. రోజుకు రెండు సార్లు ఉదయం సాయింత్రం భోజనం తరువాత
జలుబు ఉంటే 3 నుంచి 5 రోజుల పాటు సిట్రిజన్ రోజుకు ఒకటి, అజిత్రోమైసిన్ 500 ఎంజీ ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి.
వైరల్ మందులు 5 రోజుల పాటు వాడాలి.
హైడ్రాక్సీక్లోరోక్విన్ 200 ఎంజీ.. రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తరువాత వేసుకోవాలి.
విరోచనాలు తగ్గేందుకు.. స్పోర్ లాక్ (డీఎస్).. టాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత
గ్యాస్/కడుపులో మంట తగ్గేందుకు.. ఫాంటాసిడ్ డీఎస్ఆర్.. పరగడుపున ఏమీ తినక ముందు వేసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు..
ప్రతి రోజు ఉదయం 10 గ్రాముల చ్యవన్ ప్రాస్ తీస్కోవాలి
హెర్బల్ టీ, తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలు, శొంఠి, బెల్లం వేసి ఒకరికైతే రెండు కప్పుల నీళ్లు పోసి కప్పు అయ్యేంతవరకు ఉంచి .. వడకట్టి అందులో నిమ్మరసం పిండుకుని తాగాలి.
రోజుకు రెండు సార్లు ఎండు ద్రాక్ష తినాలి
వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసుకుని రోజుకి రెండు సార్లు తాగాలి.
రోజూ తాగేందుకు వేడినీరే ఉపయోగించాలి.
వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి.
నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్ నోట్టో వేసుకుని 30 సెకన్లపాటు పుక్కిలించి ఉమ్మివేయాలి.
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి.
చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
రోజూ అరగంట పాటు యోగా, ప్రాణాయామం చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com