చివరి ఏడాది పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ

చివరి ఏడాది పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ
X

యూనివర్సిటీ విద్యార్థుల చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే, పిటిషన్ పై మూడురోజుల్లో యూజీసీ స్పందించాలని ఆదేశించి.. విచారణను జూలై31కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 30లోపు చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని జూలై 6న యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని విద్యార్థులు అంటున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పరీక్షల నిర్వాహణకు సిద్దమవుతున్నారు.

Tags

Next Story