పీఎం‌ కేర్స్‌పై తీర్పు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

పీఎం‌ కేర్స్‌పై తీర్పు వాయిదా వేసిన సుప్రీం కోర్టు
X

పీఎం కేర్స్ ఏర్పాటు, ఈ నిధులును ఎన్డీఆర్ఎఫ్‌కు తరలించారనే ఆరోపణలతో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ వాయిదా పడింది. అయితే, సుప్రీం కోర్టులో ఈ విషయంపై వివరణ ఇచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి పలు విషయాలు నివేదించారు. పీఎం కేర్స్ ఫండ్ అనేది పూర్తిగా ‘‘స్వచ్ఛంద నిధి’’ అని.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. అయితే పిటిషనర్ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే.. పీఎం కేర్స్ నిధుల విశ్వసనీయతను తాము శంకించడంలేదని తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారన్నదే తమ అభ్యంతరమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులపై కాగ్ ఆడిట్ చేస్తుందని.. కానీ, పీఎం కేర్స్ నిధుల ఆడిట్ మాత్రం ప్రయివేటు సంస్థలతో చేయిస్తామని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

Tags

Next Story