మరోసారి గవర్నర్ వద్దకు సీఎం.. ఈసారి కూడా అంతేనా?

రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రాను.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరోసారి కలిశారు.. ఈ సందర్బంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. కాగా అసెంబ్లీని సమావేశపరచే విధంగా క్యాబినెట్ రూపొందించిన నోట్ ను రాజ్ భవన్ తిరస్కరించడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ బుధవారం గవర్నర్ కలరాజ్ మిశ్రా నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.
అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చే ముందు గవర్నర్ 21 రోజులు లేదా 31 రోజుల నోటీసులు ఇచ్చినా తమ ప్రభుత్వమే విజయం సాధిస్తుంది అని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.
కాగా అసెంబ్లీ సెషన్‌కు 21 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో సభలో భౌతిక దూరం పాటించాలనే కారణాలతో కలరాజ్ మిశ్రా సెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఒకే చెప్పలేదు. దీనిపై కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com