అంతర్జాతీయం

అమెరికాలో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మృతుల సంఖ్య

అమెరికాలో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మృతుల సంఖ్య
X

అమెరికాలో క‌రోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా బారీగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. దేశంలో కరోనా బారిన పడి మంగళవారం ఒక్క‌రోజే 1592 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త రెండున్న‌ర నెల‌ల్లో ఒకేరోజు ఇంత మంది మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి.

అమెరికాలో క‌రోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కు 1,52,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం కొత్త‌గా 60 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 44,98,343కు చేరాయి. కరోనా మహమ్మారి బారి నుంచి 21,85,894 మంది కోలుకున్నారు. ఇక 21,60,129 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES