కరోనా ఎఫెక్ట్.. ఇళ్లు కొనేవారు లేరు

కరోనా ఎఫెక్ట్.. ఇళ్లు కొనేవారు లేరు
X

కరోనా ప్రభావం ఇళ్ల అమ్మకాలు, కొనుగోలు మీద భారీగా పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నివాస గృహాల అమ్మకాలు 79 శాతం క్షీణించినట్లు ప్రముఖ బ్రోకరేజి సంస్థలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ఎన్‌సీఆర్‌ దిల్లీ, ఘజియాబాద్, ఫరీదాబాద్, ముంబయి, పుణె నగరాల్లో నివాస గృహాల అమ్మకాల తీరుతెన్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

* హైదరాబాద్‌లో గత ఏడాది జూన్ త్రైమాసికంలో 8,122 ఇళ్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి 1,099 శాతం మాత్రమే కొనుగోలు అయ్యాయి. ముంబయిలో, అహ్మదాబాద్, దిల్లీలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బెంగళూరులో ఈ నగరాలతో పోలిస్తే ఇళ్ల కొనుగోలు వ్యవహారం కాస్త మెరుగ్గా ఉంది.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఆరు నెలల కాలంలో హైదరాబాదులో ఇళ్ల అమ్మకాలు 62 శాతం తగ్గి 6,653 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అయితే ద్వితీయార్థంలో ఇళ్ల అమ్మకాలు కోలుకునే అవకాశం ఉందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story