ఎల్ఐసి కంపెనీ ఐపీఓ ప్రాసెస్ వేగవంతం

ఎల్ఐసి కంపెనీ ఐపీఓ ప్రాసెస్ వేగవంతం
X

ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC త్వరలో IPOకు రానుంది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా Pre-IPO ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించింది. 11 సంస్థలు ధరఖాస్తు చేసుకోగా... 5 కంపెనీలను షార్ట్ల లిస్ట్ చేసింది. ఈవారంలో తుది రెండు కంపెనీలను ఫైనల్ చేయనుంది ప్రభుత్వం. సిటీ గ్రూప్, ఎడల్వైజ్, SBI కేపిటల్ మార్కెట్, క్రెడిట్ స్యూస్, డెలాయిట్ కంపెనీలు ఫైనల్ రేసులో ఉన్నాయి. గతంలో ఆయా కంపెనీలకు ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకుని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ ఐదు కంపెనీల్లో రెండింటికి LIC ప్రీ ఐపీఓ ప్రాసెస్ చేసే బాధ్యతలను అప్పగిస్తారు. దేశంలో అతిపెద్ద బీమా సంస్థగా ఉంది LIC. ఇండియా ఇన్సూరెన్స్ మార్కెట్లో 69శాతం వాటా దీని సొంతం. మొత్తం అసెట్ వాల్యూ రూ.34 లక్షల కోట్లు. 2020 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రీమియంగా 1.78లక్షల కోట్లు వసూలు చేసింది. గత ఏడాది కంటే ఇది 25.17 శాతం ఎక్కువ. LICలో ప్రభుత్వానికి 95శాతం వాటా ఉంది. ఇందులో ఎంత షేర్ అమ్మాలి.. ఎలా విక్రయించాలి అనేదానిపై ఆయా కంపెనీలు ఇచ్చే సలహాల ఆధారంగా చట్టం చేసి IPO కు వస్తుంది ప్రభుత్వం.

Tags

Next Story