క్రెడిట్ ఫౌచీకి.. విమర్శలు నాకా.. ఇదెక్కడి న్యాయం: ట్రంప్

పాపం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరాలోచనలో పడ్డారు. నేను నియమించిన ఫౌచీని అందరూ ఇష్టపడుతున్నారు.. కానీ నన్ను మాత్రం విమర్శిస్తున్నారు.. దీనికంతటికీ నా వ్యక్తిత్వమే అని తనని తాను సద్విమర్శ చేసుకున్నారు. మంగళవారం శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో తానంటే ఎవరికీ ఇష్టం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీనే ఎక్కువ ఇష్టపడుతున్నారని ఆయన తన బాధను వెళ్లగక్కారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కొవిడ్ నియంత్రణకై డాక్టర్ ఫౌచీ, డాక్టర్ బిర్క్స్ తో సహా వైద్య నిపుణుల బృందం సూచనలనే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. కానీ క్రెడిట్ అంతా ఫౌచీ కొట్టేస్తున్నారు. నాకు మాత్రం విమర్శలు మిగులుతున్నాయి.. అని ట్రంప్ వాపోయారు. దేశాధ్యక్షుడికైనా తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే ఫౌచీ అభిప్రాయాలకే అమెరికా ప్రజలు విలువిస్తున్నారు. దాంతో ట్రంప్.. ఫౌచీని తీసి వేరేవారిని ఆ స్థానంలో నియమించాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com