అతిపెద్ద డీల్ కు సిద్దమవుతోన్నరిలయన్స్!

అతిపెద్ద డీల్ కు సిద్దమవుతోన్నరిలయన్స్!
X

మార్కెట్లో మంచి జోరుమీదన్నరిలయన్స్.. టేకొవర్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అతిపెద్ద డీల్ కు సిద్దమవుతోంది. బిగ్ బజార్ సహా మొత్తం 17 రకాల రిటైల్ సంస్థలను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ రిటైల్ అసెట్స్ రూ.24వేల నుంచి 27 వేల కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీకి ఉన్న అప్పులతో సహా 27 వేల కోట్లకు కంపెనీని కొనేందుకు రిలయన్స్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 17 రిటైల్ కంపెనీలున్నాయి ఫ్యూచర్ గ్రూపులో.. ఇందులో లిస్ట్ అయిన కంపెనీలు ఐదు. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ మార్కెట్ నెట్ వర్క్ అన్ని కలిపి ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లో విలీనం కానున్నాయి. రిలయన్స్, ఫ్యూచర్ డీల్ పై జులై31న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒప్పందం ఖరారైతే బిగ్ బజార్, ఫుడ్ హాల్, నిలగీరిస్, FBB, హరిటేజ్ ఫుడ్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, లీకూపర్ సహా పలు రిటైల్ సంస్థలు ఇక రిలయన్స్ కిందకు వస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1700 స్టోర్లు ఫ్యూచర్ సంస్థకు ఉన్నాయి. ఈ డీల్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ కూడా రిలయన్స్ లో పెట్టుబడులు పెడుతోంది. ఈ నిధులను ఇటు మళ్లించే అవకాశం ఉందని చెబుతున్నాయి కంపెనీ వర్గాలు. ఇప్పటికే రుణ రహిత కంపెనీగా RIl మారింది. తాజాగా వచ్చే పెట్టుబడులతో మరిన్నికంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెజార్టీ వాటా దక్కించుకోవాలని చూస్తోంది. టెలికం రంగంలో ప్రపంచంలో నెంబర్ 2 కంపెనీగా అవతరించింది. ఆయిల్ రంగంలో వాల్డ్ టాప్ 2 కంపెనీగా ఈ వారమే ఎదిగింది. ఇక రిటైల్ లో కూడా ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటిగా మారేందుకు రిలయన్స్ వ్యూహాలు రచిస్తోంది.

Tags

Next Story