క్వారంటైన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లి

ఎక్కడో ఉన్న ఆ ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ ఒకే క్వారంటైన్లో ఉన్నారు. దాంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారి తీసింది. ప్రకాశం జిల్లా పర్చూరుకి చెందిన యువకుడు హైదరాబాదులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి కరోనా సోకడంతో గుంటూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే హాస్పిటల్ లో అడ్మిట్ అయింది గుంటూరు చిలకలూరిపేటకు చెందిన ఇంజనీరింగ్ చదివిన యువతి. ఆమెకు పాజిటివ్ రావడంతో అక్కడే జాయినై చికిత్స తీసుకుంటోంది. ఇద్దరివీ పక్కపక్క బెడ్లు కావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని రెండు వారాల అనంతరం కొవిడ్ నుంచి బయటపడ్డారు. తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు వివరించారు. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో వారుకూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో ఇద్దరూ ఒక్కటయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com