టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, రచయిత రావి కొండల రావు మంగళవారం కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా ఆయన వివిధ రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1958లో శోభ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. 600 కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. తమిళ, మలయాళ సినిమాల్లో డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పేరు తెచ్చుకున్నారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. కాగా, రావికొండలరావు భార్య ప్రముఖ నటి రాధా కుమారి. ఆమె 2012లో గుండెపోటుతో కన్నుమూశారు. విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె కూడా 600 పై చిలుకు చిత్రాల్లో నటించారు. భార్యా భర్తలిద్దరూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story