పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ

పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ
X

పాక్‌ బాంబులను ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేసింది. ఈ ఘటన కర్మరా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎన్ని ఎదురు దెబ్బులు తిన్న పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోవటం లేదు. గత కొద్ది రోజులుగా తరచూ ఎల్‌ఓసీ వెంట, సరిహద్దు గ్రామాలపై బాంబులతో పాటు మోర్టార్‌ షెల్స్‌ను ప్రయోగిస్తోంది. దీంతో పలు చోట్లతో సైనికులతో పాటు సామాన్య ప్రజలు సైతం గాయపడుతున్నారు.

తాజాగా పూంచ్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కర్మరా ప్రాంతంలోని నివాస ప్రాంతాల వద్ద పాక్‌ చెందిన పేలని బాంబులను గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్‌ రెండు బాంబులను నిర్వీర్యం చేసింది. పూంచ్‌ సెక్టార్‌లో పది రోజుల కిందట ప్రయోగించిన మోర్టార్‌ షెల్‌ ఓ ఇంటిపై పడడంతో ఒకే కుటుంబానికి మృతి చెందారు. అలాగే పలువురు గాయపడ్డారు.

Tags

Next Story