సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగించండి : సీఎం జగన్ లేఖ

సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగించండి : సీఎం జగన్ లేఖ
X

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. ఆమె పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరగా.. కేంద్రం మూడు నెలలు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రకారం సెప్టెంబర్ 30 తో నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జగన్ మరోసారి లేఖ రాశారు.

నీలం సాహ్ని 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె సుదీర్ఘకాలం పనిచేశారు. నల్గొండ జాయింట్ కలెక్టర్ మచిలీపట్టణం అసిస్టెంట్ కలెక్టర్ గా నీలం సాహ్ని పనిచేశారు. శిశుసంక్షేమ శాఖ పీడీగా , మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ 13న ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమించారు.

Tags

Next Story