బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్
X

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక క‌ర్ణాట‌క‌లో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా బారిన పడ్డారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు మ‌త్తిముడ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో క‌ర్ణాట‌క‌లో క‌రోనా సోకిన ఎమ్మెల్యే సంఖ్య మూడుకు చేరింది. ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు క‌ల‌బురాగి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బ‌స‌వ‌రాజు బెంగ‌ళూరులోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. త‌నను ఇటీవ‌ల క‌లిసిన వారంతా.. క‌రోనా నివార‌ణ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు.

Tags

Next Story