అంతర్జాతీయం

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు
X

అగ్ర‌రాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్ర‌తి రోజు పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిత్యం పాజిటివ్ కేసులతో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా బారీగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఒక్కరోజే అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాల సంఖ్య నమోదయ్యింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 1,227 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త‌ మే నెల తర్వాత అమెరికాలో ఒకేరోజు 1,200కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ఇదే తొలిసారని అక్క‌డి అధికారులు తెలిపారు. ఇక మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే అమెరికాలో కొత్త‌గా 64 వేల క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో.. దేశవ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 44.98 ల‌క్ష‌ల‌కు చేరింది.

Next Story

RELATED STORIES