రూ.59కే కరోనా ట్యాబ్లెట్

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ 'ఫావిపిరవిర్'ను ప్రముఖ ఫార్మా సంస్థ హెటీరో బుధవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'ఫావివిర్' పేరుతో ఉన్న ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు పేర్కొంది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఇవి అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే దీనిని విక్రయిస్తారని తెలిపింది.
కొవిడ్ బాధితులు కోలుకోవడంలో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ సమర్థంగా పనిచేస్తున్నదని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో దీనికి జెనరిక్ వెర్షన్‌గా హెటిరో.. ఫావివిర్‌ను ఆవిష్కరించింది. దీని తయారీకి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని హెటిరో సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే 'కోవిఫర్' పేరుతో రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

