ప్రైవేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్న కరోనా.. లక్షల్లో బిల్లు

ప్రైవేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్న కరోనా.. లక్షల్లో బిల్లు
X

ఎప్పుడైతే కరోనా గవర్నమెంట్ ఆస్పత్రి గడప దాటి ప్రైవేట్ ఆస్పత్రి మెట్లెక్కిందో అప్పట్నించి దోచుకోవడం మొదలైంది. ఆస్తులు అమ్మకుని అంత డబ్బు ఖర్చుపెట్టినా మనిషి ప్రాణాలతో ఉంటున్నాడా అంటే అదీ కనిపించట్లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆస్పత్రుల్లా ఉండవన్నది వాస్తవమే అయినా మరీ ఫీజులు అంత వసూలు చేస్తుంటే కరోనా వచ్చిందన్న దిగులు కంటే ఫీజులు కట్టలేక తల పట్టుకుంటున్నారు పేషెంట్ తాలూకూ బంధువులు. తాజాగా చంపాపేటకు చెందిన దంపతులకు ఈనెల 10న పాజిటివ్ అని రిపోర్టులు రావడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల తరువాత వారిని డిశ్చార్జ్ చేశారు.

15న మళ్లీ ఆయాసంగా ఉందని భర్త అదే ఆస్పత్రిలో చేరాడు.. భార్య కూడా ఆ మరుసటి రోజే తీవ్ర అస్వస్థతకు గురవడంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరికీ చికిత్స అందుతున్నా మంగళవారం అక్కడ భర్త, ఇక్కడ భార్య ఒకేరోజు కన్నుమూశారు. ఆస్పత్రి యాజమాన్యం 14 రోజుల చికిత్సకు గాను రూ.17.5 లక్షల బిల్లు వేశారు. అప్పటికే రూ.8 లక్షలు చెల్లించగా మిగతా మొత్తం కట్టి మృతదేహం తీసుకెళ్లమని సూచించింది. బంధువులు నిలదీయడంతో ఆస్పత్రి యాజమాన్యం దిగి వచ్చి రూ.2 లక్షలకు కట్టించుకుని మృతదేహాన్ని అప్పగించింది.

Tags

Next Story