ప్రవహించే నదిలో వెయ్యికి పైగా శివలింగాలు..

X
By - TV5 Telugu |30 July 2020 12:28 AM IST
కర్ణాటకలోని సిర్సి తాలూకాలో దట్టమైన అడవిలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. అడవి మధ్యలో ఓ చోట అనేక బండరాళ్లు దర్శనమిస్తాయి. వాటన్నింటిపైన శివలింగాలు కనిపిస్తాయి. వేల సంఖ్యలో చెక్కి ఉన్న ఆ శివలింగాల గురించి 2011లో పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రపంచానికి తెలియజేశారు. షాల్మలా నదీ ప్రాంతంలో ఉన్న ఈ శివలింగాలు పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్నాయి. క్రీ.శ 1678-1718 కాలంలో సిర్సి రాజు అరసప్ప నాయక్ ఈ లింగాలను చెక్కించినట్లు ఉత్తర కన్నడ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఈ శివలింగాల గురించి తెలియడంతో అప్పటి నుంచి భక్తులు ప్రతిఏటా శివరాత్రి నాడు వేలాదిమంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుని శివయ్యను దర్శించుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

