అంతర్జాతీయం

కువైట్:ఇండియా నుంచి వచ్చే రెసిడెంట్లపై బ్యాన్‌

కువైట్:ఇండియా నుంచి వచ్చే రెసిడెంట్లపై బ్యాన్‌
X

ఇండియా నుంచి వచ్చే రెసిడెంట్స్‌పై బ్యాన్‌ విధిస్తున్నట్లు కువైట్‌ వెల్లడించింది. ఇండియాతో పాటు ఇరాన్‌, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌ తదితర దేశాల నుంచి వచ్చేవారిపైనా తదుపరి ప్రకటన వరకూ నిషేధం వుంటుందని పేర్కొంది. గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పైన పేర్కొన్న దేశాలకు చెందిన వారిని మినహాయించి, మిగిలిన వారికి ఆయా దేశాల నుంచి వచ్చేందుకు, కువైట్‌ నుంచి వెళ్ళేందుకు అనుమతినిస్తూ కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఇటీవల తీర్మానం చేసిన సంగతి తెల్సిందే. కాగా, ప్రయాణీకులు హెల్త్‌ రిక్వైర్‌మెంట్లకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఈ మేరకు కొన్ని నిబంధనల్ని రూపొందించింది.

Next Story

RELATED STORIES