వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్: పేర్నినాని

X
By - TV5 Telugu |30 July 2020 2:35 AM IST
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచిలీపట్నంలో అయితే కేసులు మరింతగా ఉదృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. మచిలీపట్నంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయం సేకరించి సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాల షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. బస్సులు, ఆటోలు, మోటార్ బైక్ లు రోడ్లపై తిరగకూడదని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

