భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైంది: రాజ్‌నాథ్ సింగ్

భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైంది: రాజ్‌నాథ్ సింగ్
X

రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరిన తరుణంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రాఫెల్ రాకపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పక్షలు భద్రంగా దిగాయని.. రాఫెల్ రాకతో భారత్ సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైందని ట్వీట్ చేశారు. ఈ మల్టీ రోల్ విమానాలు మన వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేస్తాయిన అన్నారు.

కాగా, మొదటి డెలివరీ లో భాగంగా మొత్తం ఐదు రాఫెల్ యుద్దవిమానాలు హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యాయి.

Tags

Next Story