డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్స్

డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్స్
X

చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీ అచ్యుత చిట్ ఫండ్స్ బాధితులు.. గుంటూరు లోని సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. నెల నెలా క్రమం తప్పకుండా చిట్టీ డబ్బులు వసూలు చేసిన సంస్థ ఎండి రామకృష్ణ తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడం లేదని మండిపడ్డారు. శ్రీ అచ్యుత చిట్ ఫండ్స్ చాలా చోట్ల ఐపి పెట్టిందని చెప్పారు. రామకృష్ణకు అండగా నిలుస్తున్న వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Tags

Next Story