138 మంది పోలీసులకు పాజిటివ్..

138 మంది పోలీసులకు పాజిటివ్..
X

దేశంలో కరోనా అధికంగా వ్యాపించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో సాధారణ ప్రజలతో పాటు, మహమ్మారిపై ముందుండి పోరాడిన పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో 138 మంది పోలీసులు కరోనా బారిన పడగా, అందులో ఇద్దరు మరణించారు. రాష్ట్రం మొత్తం మీద 9096 మంది పోలీసులకు కరోనా సోకిందని మహారాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందులో 7084 మంది పోలీసులు కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 1,46,433 మంది కాగా మరణించిన వారు 14,463 మంది. దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు 52,123.

Tags

Next Story