31 July 2020 3:40 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / తైవాన్ మాజీ అధ్యక్షుడు...

తైవాన్ మాజీ అధ్యక్షుడు మృతి

తైవాన్ మాజీ అధ్యక్షుడు మృతి
X

తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్-హుయ్ మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీ టెంగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. బహుళ అవయవ వైఫల్యంతో తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్‌లో గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో లీ మరణించారని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి నుండి న్యుమోనియా కారణంగా వైద్యుల సంరక్షణలో వున్నారాయన, కాని గత వారం రోజులుగా ఆరోగ్యం ఆందోళన కరంగా మారింది, ప్రస్తుత అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ బుధవారం ఆస్పత్రిలో లీని పరామర్శించారు.

Next Story