సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ ఆగష్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని.. ఈ సందర్బంగా అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని పురష్కరించుకొని.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24

వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని సూచించారు. అలాగే అయోధ్యలో రామాలయం నిర్మాణ కార్యక్రమం భూమి పూజ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం.’ అంటూ లేఖలో రఘురామ పేర్కొన్నారు.

Tags

Next Story