హోంక్వారంటైన్‌లోకి నాగాలాండ్ సీఎం

హోంక్వారంటైన్‌లోకి నాగాలాండ్ సీఎం
X

నాగాలాండ్ సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన ఇంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఇంట్లో కరోనా సోకిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి ఇంటిని శానిటైజ్ చేశారు. అటు, 48 గంటల పాటు సీఎం క్యాంప్ ఆఫీసును కూడా మూసివేశారు. నలుగురికి కరోనా సోకడంతో.. సీఎంతో పాటు, సీఎం కార్యాలయ సిబ్బంది కూడా హోం క్వారంటైన్ లోకి

వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. కాగా, ఇప్పటివరకూ నాగాలాండ్ లో 1,566 కరోనా కేసులు నమోదైనాయని నాగాలాండ్ కుటుంబసంక్షేమ శాఖ మంత్రి పంగన్యూ ఫోమ్ చెప్పారు.

Tags

Next Story