రాజస్థాన్ స్పీకర్, బీఎస్పీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటిసులు

రాజస్థాన్ శాసనసభ స్పీకర్, బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో విలీనం చేశారని.. దీనికి స్పీకర్ కూడా ఆమోదం తెలిపారంటూ బీఎస్పీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు బీఎస్పీ ఎమ్మెల్యేలకు, స్పీకర్ కు నోటీసులు పంపించింది. తమ పార్టీ టికెట్ పై శాసన సభ ఎన్నికల్లో గెలిచి.. తరువాత కాంగ్రెస్ లో విలీనం అవుతున్నామని తమ ఎమ్మెల్యేలు ప్రకటించారని.. వారి ప్రతిపాదనను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ ఆమోదించారని బీఎస్పీ అధినేత్రి మాయావతి హైకోర్టులోత తెలిపారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. అయితే, బీఎస్పీ తరుపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఏడాది తరువాత కాంగ్రెస్ లో విలీం అయ్యారు. దీనిని సవాల్ చేస్తూ.. బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తరువాత బీఎస్పీ కూడా కోర్టు తలుపులు తట్టింది. దీంతో రెండు పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయించింది. కాగా.. బీఎస్పీ నేతలు మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో విలీనం కాలేదని.. కాబట్టి రాష్ట్ర స్థాయిలో విలీనం సాద్యం కాదని అంటున్నారు. రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యే ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com