ఆగస్ట్ 10 లోపు వ్యాక్సిన్..

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ లో ఉన్న దేశాల్లో అమెరికా, భారత్, చైనా, రష్యా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే రష్యా ఆగస్ట్ 10 లోపు వ్యాక్సిన్ తీసుకు వస్తామని ప్రకటించడం విశేషం. తొలుత వైరస్ బారిన పడిన వైద్యులకు సరఫరా చేసి, ఆ తరువాత దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆదేశ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెషనోవ్ వర్శిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో ఆశలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండడంతో ఈ ఏడాది లోపు కోవిడ్ నుంచి విముక్తి కలుగుతుందని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇక మనదేశానికి సంబంధించిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సైతం ఆగస్ట్ మూడో వారంలో ఐసీఎంఆర్ విడుదల చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com