అంతర్జాతీయం

అధ్యక్ష ఎన్నికలు వాయిదా?.. ట్విట్టర్‌లో ట్రంప్

అధ్యక్ష ఎన్నికలు వాయిదా?.. ట్విట్టర్‌లో ట్రంప్
X

అమెరికా అధ్యక్షడు సంచలన ట్వీట్ చేశారు. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అద్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు ట్విట్టర్ వేదికగా సంకేతాలు ఇస్తున్నారు. ‘‘ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగే వరకు ఎన్నికలు ఆలస్యం???’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. పోస్టల్ ఓటింగ్ జరిగితే మోసపూరితమైన, తప్పుడు ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి ఓట్లు వేస్తే.. ఈ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉందని పోస్టల్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని అమెరికాలో పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. కానీ, ట్రంప్ మెయిల్-ఇన్ ఓటింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివలన ఎన్నికల ఫలితాల తప్పుగా వచ్చే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

Next Story

RELATED STORIES