అనిల్‌ అంబానీకి 'యస్'‌ బ్యాంకు షాక్.. ప్రధాన కార్యాలయం స్వాధీనం

అనిల్‌ అంబానీకి యస్‌ బ్యాంకు షాక్.. ప్రధాన కార్యాలయం స్వాధీనం
X

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు 'యస్' షాక్ ఇచ్చింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో 2,892 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున సర్బర్బన్ శాంటాక్రూజ్‌లోని అనిల్ అంబానీ గ్రూప్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని 'యస్' బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని

కంపెనీ గతేడాది ప్రయత్నించింది. అయితే తాజాగా దక్షిణ ముంబైలో రెండు ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు యస్ బ్యాంక్ ఒక వార్తాపత్రికలో ప్రచురించిన నోటీసులో పేర్కొంది. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) లోని దాదాపు అన్ని పెద్ద కంపెనీలు 'రిలయన్స్ సెంటర్' పేరుతో శాంటాక్రూజ్ కార్యాలయం నుండి పనిచేస్తున్నాయి.

Tags

Next Story