అంతర్జాతీయం

డిజిటల్ సంస్థలకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

పేస్‌బుక్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలకు ఆస్ట్రేలియా ప్రభుత్వ షాక్ ఇచ్చింది. వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మీడియా సంస్థలకు చెల్లించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మీడియా సంస్థలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించికపోతే.. కోడ్ ఉల్లంఘించిన కార‌ణంగా స‌ద‌రు కంపెనీల‌పై దాదాపు 7 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఆగ‌స్టు 28 వ‌ర‌కు చర్చలు జరిపి.. ఓ ఒప్పందం కుదుర్చుకోవాల‌ని సూచించారు. ఈ ఏడాది చివ‌రి నాటికి దీనికి సంబంధించి చ‌ట్టం అమ‌ల్లోకి తెస్తామ‌ని జోష్ ఫ్రైడెన్‌బర్గ్ వివ‌రించారు. గత కొంత కాలంగా తమ కంటెంట్ ను వాడుకొని సొమ్ము చేసుకుంటున్నాయని మీడియా సంస్థలు డిజిటల్ కంపెనీలను ఆరోపిస్తున్నాయి. కాపీరైట్స్ కింద ఎలాంటి చెల్లింపులు చేయకుండా సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. దీంతో ఆస్ర్టేలియా ప్ర‌భుత్వం అక్క‌డి మీడియాకు మ‌ద్ద‌తుగా నిలిచిచి డిజిటల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి.

Next Story

RELATED STORIES