అంతర్జాతీయం

కరోనా ఎఫెక్ట్‌.. శాసనమండలి ఎన్నికలు వాయిదా

కరోనా ఎఫెక్ట్‌.. శాసనమండలి ఎన్నికలు వాయిదా
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఇక హాంగ్‌కాంగ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 6న నిర్వహించాల్సిన హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ప్రకటించారు.

కాగా హాంగ్‌కాంగ్‌ దేశంలో ఇప్పటివరకు 3,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది.

Next Story

RELATED STORIES