కర్ణాటకలో కరోనాతో ఒకేరోజు 84 మంది మృతి

కర్ణాటకలో కరోనాతో ఒకేరోజు 84 మంది మృతి
X

కర్ణాటకలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడి 84 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 5,483 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,115కు చేరింది. ఇదిలా ఉండగా 49,788 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 2,314 మంది ఇప్పటివరకు కరోనాతో మృతి చెందారు. 72,005 మంది ప్రస్తుతం కరోనాతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story