కేరళలో కొత్తగా 1,310 కరోనా పాజిటివ్ కేసులు

కేరళలో కొత్తగా 1,310 కరోనా పాజిటివ్ కేసులు
X

కేరళ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పాజటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,310 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారి నుండి ఇప్పటివరకు 13,027 మంది కోలుకున్నారు. 10,495 మంది వివిధ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా70 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story