వియత్నాంలో తొలి కరోనా మరణం నమోదు

X
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. కరోనా దెబ్బకి పలు దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వియత్నంపై కూడా తన పంజా విసిరింది. తాజాగా వియత్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. డానాంగ్లో ఇటీవల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన కరోనా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే దేశంలో మొదటి కరోనా మరణమని స్థానిక మీడియా తెలిపింది.
తాజాగా డానాంగ్లో కరోనా కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డానాంగ్ నుంచి హానోయి వచ్చిన వారిందరికీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. కాగా వియత్నం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 509 మంది కరోనా బారిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
