ప‌శ్చిమ‌బెంగాల్‌లో 70 వేలు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు

ప‌శ్చిమ‌బెంగాల్‌లో 70 వేలు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు
X

ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పాజటవ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. శుక్ర‌వారం కొత్త‌గా 2,496 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 70,188కి చేరింది. అందులో 48,374 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 20,233 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బెంగాల్‌లో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1581కి చేరింది.

Tags

Next Story