దేశంలో కరోనా కేసులు.. జూన్ నెలతో పోలిస్తే 2.8 శాతం అత్యధికం

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,000కు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 57,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 50,000కి పైగా కరోనా కేసులు నమోదవడం వరుసగా ఇది నాలుగవ రోజు. శుక్రవారం కరోనా కారణంగా 766 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కరోనా కేసులు జూన్ నెలతో పోలిస్తే జూలైలో 2.8 శాతం అత్యధికంగా నమోదయ్యాయి. జూన్ నెలలో సుమారు 4 లక్షల కేసులు ఉన్నాయి. కాగా జూలైలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య జూన్ కంటే 1.6 రెట్లు అధికంగా ఉంది. జూలై నెలలో 11.1 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19,122 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 16,96,780 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 36,551 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

