కరోనా వైరస్‌ను అడ్డుకునే దుస్తులు..

కరోనా వైరస్‌ను అడ్డుకునే దుస్తులు..
X

నానో మెటీరియల్స్‌కు వైరస్ ని అడ్డుకునే శక్తి ఉందని ఎప్పటి నుంచో పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ దుస్తులకు వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకునే శక్తి ఉంటుందని దాదాపు 8 ఏళ్ల క్రితమే డీఆర్‌డీవోకి చెందిన డీఐఏడీతో కలిసి వైరస్ ను ఎదుర్కునే దుస్తులను తయారు చేశారు. ఈ ప్రయోగాలు విజయవంతమైనా వాణిజ్యపరంగా వాటిపై దృష్టి పెట్టలేదు. రాగి, జింక్, వెండి మొదలైన లోహాలకు వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందని పూర్వీకులు భావిస్తూ వచ్చారు. కొన్ని రకాల మూలికలను కలిపి వేడిచేయడం ద్వారా వీటి కణాలలో మార్పులు తేవచ్చని వారు కనుగొన్నారు. ఇలా మార్పులు చేసిన లోహాల ద్వారా మందులను తయారు చేసి రకరకాల జ్వరాలు, అంటువ్యాధులు తగ్గించడానికి వాడేవారు.

ఒక లోహపు కణ కేంద్రంలో మార్పులు జరిగినప్పుడు ఆ లోహతత్వం కూడా మారుతుంది. దాని పరిమాణం కూడా మారుతుంది. ఇలా ఏర్పడినవే నానో కణాలు. ఈ కణాలకు వైరస్ ను అడ్డుకునే శక్తి ఉంటుంది. అయితే ఇవి కోవిడ్ ను ఎదుర్కుంటాయా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది అని డీఆర్‌డీవోకి చెందిన శాస్ట్రవేత్త ఒకరు వెల్లడించారు. కానీ కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని అందువల్లే కొన్ని పరిశోధనాశాలల్లో మాత్రమే పరీక్షలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. నానో మెటీరియల్ ఆధారిత దుస్తులను.. పీపీఈ కిట్లు, మాస్కులు, ఆస్పత్రుల్లో బెడ్ షీట్లు, డాక్టర్లు వేసుకునే కోట్లు, నర్సుల యాప్రాన్లు.. ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. రెండు పద్దతుల్లో ఈ నానో మెటీరియల్ తయారు చేస్తారు. ఒక పద్దతిలో బట్టపైన కోటింగ్ వేస్తారు. రెండో పద్దతిలో బట్టను తయారు చేసే సమయంలోనే నానో మెటీరియల్ ను కలుపుతారు.

Tags

Next Story